VIDEO: ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర

TG: ఖైరతాబాద్ గణనాథుడి శోభాయాత్ర వేగంగా సాగుతోంది. రాజ్ దూత్ సర్కిల్ వరకు బొజ్జ గణపయ్య చేరుకున్నాడు. భక్తులు ఆటపాటలతో వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. అయితే భక్తులు ఎక్కువ సంఖ్యలో రావడంతో.. పోలీసులు అదుపుచేయలేకపోతున్నారు. కాగా, ఖైరతాబాద్ వినాయకుడి కోసం వేరే ఏకదంతులను పోలీసులు నిలిపివేశారు. ముందు బడా గణేశ్ వెళ్లిన తర్వాత.. వెనకాల ఇతర గణనాథులను విడిచిపెట్టనున్నారు.