ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి: జేసీ
ప్రకాశం: మార్కాపురం జిల్లాలో ఎండ తీవ్రత పెరుగుతుందని, ప్రజలు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు సోమవారం తెలిపారు. నాలుగు నియోజకవర్గ కేంద్రాలలో దుకాణాల ముందు వ్యాపారస్థులు మంచినీటిని ఏర్పాటు చేయాలని కోరారు. తమ అవసరాల నిమిత్తం ప్రజలు కలెక్టరేట్‌కు వచ్చేవారు, తమ వెంట వాటర్ బాటిల్స్ తీసుకొని రావాలన్నారు.