ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరికలు
NLG: చింతపల్లికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు మహమ్మద్ సర్వర్, యూత్ కార్యదర్శి ఆంజనేయులుతో పాటు 30 కుటుంబాలు బుధవారం బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే బాలునాయక్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై స్వచ్ఛందంగా కాంగ్రెస్‌లోకి చేరుతున్నారన్నారు.