నేడు వృద్ధులకు, దివ్యాంగులకు ప్రజావాణి

MBNR: జిల్లా కేంద్రంలోని అర్బన్ తహశీల్దార్ కార్యాలయంలో బుధవారం సీనియర్ సిటిజన్స్ విజ్ఞప్తి మేరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షుడు జగపతిరావు తెలిపారు. ప్రతి నెల మొదటి బుధవారం వృద్ధులకు, దివ్యాంగులకు ప్రజావాణి కార్యక్రమం ఉంటుందన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇది జరగనుందన్నారు.