అనుమానాస్పదంగా ఎక్సైజ్ ఎస్సై మృతి

అనుమానాస్పదంగా ఎక్సైజ్ ఎస్సై మృతి

రాజన్నసిరిసిల్ల: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఎక్సైజ్ ఎస్సై అనుమానాస్పదంగా మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. ఖమ్మం జిల్లాకు చెందిన కాళీ ప్రసాద్ (54) మూడు నెలల క్రితం బదిలీపై ఎల్లారెడ్డిపేటకు వచ్చారు. ఈ క్రమంలో మండల కేంద్రంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. శుక్రవారం ఉదయం అనుమానస్పదంగా మృతి చెందినట్లు కనిపించడంతో  స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.