శిథిలావస్థలో పాఠశాల శ్లాబ్
PPM: సీతంపేట మండలం కోడిన పంచాయతీ, తోరికవలస గ్రామం జీపీఎస్ పాఠశాల శ్లాబ్ పూర్తి శిథిలావస్థకు చేరింది. వర్షానికి పాఠశాలలోకి నీరు లీకై స్టూడెంట్స్ ఇబ్బందులు గురవుతున్నమన్నారు. ఎప్పుడు పెచ్చులూడి ప్రమాదాలు జరుగుతాయోనని విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి నూతన పాఠశాలను మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.