ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన DMHO
SRCL: ప్రతి మంగళ, శుక్రవారాలలో డ్రైడే కార్యక్రమం నిర్వహించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. ఎల్లారెడ్డిపేటలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలను ఇంటింటి సర్వే ద్వారా గుర్తించి పేర్లను రిజిస్టర్లలో నమోదు చేయాలన్నారు. ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా చూడాలని సూచించారు.