నిరుపయోగంగా మారిన చెత్త సేకరణ కేంద్రం
NRPT: మద్దూర్ మండలం నాగిరెడ్డిపల్లి గ్రామ శివారులోని చెత్త సేకరణ కేంద్రం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. గతంలో ఇళ్ల నుంచి సేకరించిన చెత్తను ఇక్కడ వేరు చేసి వినియోగించేవారు. ప్రస్తుతం నిర్లక్ష్యంతో కేంద్రం వృథాగా పడిపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుని దీనిని తిరిగి వినియోగంలోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.