ఆలూరులో పోచమ్మ బోనాలు
JGL: రాయికల్ మండలంలోని ఆలూరు గ్రామంలో గురువారం పోచమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా మహిళలు ఇంటికో బోనంతో గ్రామ పురవీధుల గుండా తరలివచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. బోనాల సందర్భంగా పోతరాజులు చేసిన విన్యాసాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.