అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత

NRPT: మద్దూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్రమ ఇసుక రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి శనివారం సాయంత్రం ట్రాక్టర్లను పట్టుకున్నారు. వీరారం వాగు నుంచి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న 5 ట్రాక్టర్లను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్టు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.