సీనీయర్ పాత్రికేయుడు వడ్ల రంగస్వామి ఆనారోగ్యంతో మృతి

KRNL: గోనెగండ్ల మండల ప్రజలకు డాక్యుమెంట్ రైటర్‌గా సుపరిచితుడు అయిన వడ్ల రంగస్వామి(80)గారు ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయన కేవలం డాక్యుమెంట్ రైటర్ గానే కాకుండా 1986 నుంచి 2004 వరకు ఆంధ్రప్రభ రిపోర్టర్‌గా పని చేశారు. గోనెగండ్ల మండలంలో తొలితరం జర్నలిస్టు అయిన వడ్లరంగస్వామి భౌతికకాయాన్ని గోనెగండ్ల మండల జర్నలిస్టులు సందర్శించి పూలమాలలతో నివాళులు అర్పించారు.