'ఉపాధి హామీపై కేంద్రం కత్తి.. కూలీల పొట్ట కొడుతోంది'
SRPT: మోదీ సర్కార్ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ కూలీల నోటిలో మట్టి కొడుతోందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నేత బి.వెంకట్ మండిపడ్డారు. సోమవారం సూర్యాపేటలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గాంధీ పేరు తొలగించి కొత్త బిల్లు తేవడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 12న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.