'బీసీలకు సముచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీనే'
MBNR: బీసీలకు సముచిత స్థానం కల్పించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అక్తర్ అన్నారు. శనివారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని డీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీసీ రిజర్వేషన్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.