జనసేన పార్టీ సభ్యత్వ కిట్లు అందజేత

ELR: జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మంగళవారం ఏలూరు జనసేన పార్టీ ఇంఛార్జ్ రెడ్డి అప్పల నాయుడు ఇటీవల నమోదు చేసిన 8,884 జనసేన పార్టీ సభ్యత్వ కార్డుల కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో జనసేన పార్టీ సభ్యత్వం నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ క్రియాశీలక వాలంటీర్ల ద్వారా కార్డులు పంపిణీ చేస్తామన్నారు.