ఆటో డ్రైవర్ వద్ద కొకైన్ స్వాధీనం

కృష్ణా: తాడిగడపలో ఓ ఆటో డ్రైవర్ నక్కా పార్థసారథి ఇంట్లో పెనమలూరు పోలీసులు రూ. 5 వేల విలువైన గ్రాము కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. గుర్తుతెలియని వ్యక్తుల సమాచారం మేరకు సోదాలు నిర్వహించగా ఈ మత్తు పదార్థం దొరికింది. హైదరాబాద్‌లోని స్నేహితుడు నాగవరపు గుణశేఖర్ 15 రోజుల క్రితం కొకైన్ ఇచ్చినట్లు పార్థసారథి తెలిపాడు. బుధవారం అతడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.