VIDEO: గాజువాకలో బైక్‌కు మంటలు
VSP: గాజువాక బీసీ గేటు వద్ద మంగళవారం మధ్యాహ్నం ప్రయాణిస్తున్న ఓ బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. సమయస్ఫూర్తితో వ్యవహరించిన వాహనదారుడు వెంటనే బైక్ దిగిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంటలు ఎగిసిపడటంతో స్థానికులు సమీపంలోని పెట్రోల్ బంకు నుండి అగ్నిమాపక పరికరాలు తెచ్చి మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో బైక్ సగానికి పైగా కాలిపోయింది.