IND vs SA: టాస్ గెలిచిన టీమిండియా

IND vs SA: టాస్ గెలిచిన టీమిండియా

భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టీ20 ధర్మశాల వేదికగా జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్నాడు. 5 మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సాధించాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. దీంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ ఉత్కంఠ నెలకొంది.