BREAKING: జూబ్లీహిల్స్ అభ్యర్థి మృతి!
TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం కాసేపట్లో తేలనుంది. కౌంటింగ్‌కు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కాగా, ఈ ఎన్నిక బరిలో నిలిచిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (NCP) అభ్యర్థి మహ్మద్ అన్వర్ గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు జరగనున్న వేళ అభ్యర్థి మృతిచెందడంతో విషాదం నెలకొంది. అన్వర్ మృతిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.