VIDEO: కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి జోహార్లు: సీపీఐ

సత్యసాయి: హిందూపురం సీపీఐ నాయకులు శుక్రవారం రాత్రి ఒంగోలుకు చేరుకున్నారు. సీపీఐ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఒంగోలు రైల్వే స్టేషన్లో దిగి సురవరం సుధాకర్ రెడ్డి మరణ వార్త విని జోహార్లు అర్పించారు. హిందూపురం సీపీఐ కార్యదర్శి వినోద్ కుమార్ మాట్లాడుతూ.. సురవరం సుధాకర్ మృతి సీపీఐకి, దేశ వామపక్ష భావజాలానికి తీరని లోటని, ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు.