ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

బాపట్ల: బల్లికురవ మండలం రామాంజనేయపురం దగ్గర NAM హైవేపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు డ్రైవర్ మద్యం మత్తులో వేగంగా నడపడంతో అదుపు తప్పి కారు బోల్తాపడింది. కారులో ముగ్గురు వ్యక్తులు ఉండగా, అందులో నెల్లూరుకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మృతి చెందాడు. మిగతా ఇద్దరికి ఎలాంటి గాయాలు కాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.