దత్తాత్రేయ జయంతికి బాల్కొండ ఎమ్మెల్యేకు ఆహ్వానం

దత్తాత్రేయ జయంతికి బాల్కొండ ఎమ్మెల్యేకు ఆహ్వానం

NZB: వేల్పూరు శ్రీ గోవిందసాయి దివ్య యోగాశ్రమం షిరిడి సాయిబాబా దేవాలయ 33వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 4న శ్రీ దత్తాత్రేయ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు హాజరు కావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు. వేడుకలు గోవిందగిరి కల్యాణ మండపంలో జరుగుతాయి.