ద్రోణి ప్రభావం.. జిల్లాలో వర్షాలు

ద్రోణి ప్రభావం.. జిల్లాలో వర్షాలు

W.G: జిల్లాలో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు సంభవించాయి. ద్రోణి ప్రభావం వల్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. బుధవారం స్వల్పంగా వర్షాలు కురిశాయి. భీమడోలు, పెదపాడు, జంగారెడ్డిగూడెం, తదితర ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. ప్రస్తుతం జిల్లాలో రబీ వరి సాగు చివరి దశకు చేరటంతో వర్షాలు భారీగా కురిస్తే ఇబ్బందులు తలెత్తుతాయని రైతుల ఆందోళన చెందుతున్నారు.