ఫిలిప్పీన్స్‌లో గ్యాస్ కష్టాలు.. రోడ్లపైకి జనం
ఫిలిప్పీన్స్‌లో ఇంధన కొరత తీవ్రమైంది. గ్యాస్, పెట్రోల్ కొరతతో వాహనాలు నిలిచిపోవడంతో వేలాది మంది ఉద్యోగులు, ప్రజలు కాలినడకనే ఆఫీసులకు చేరుకుంటున్నారు. క్యూజన్ సిటీలోని ప్రధాన రహదారులు జనంతో కిక్కిరిసిపోయిన దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రవాణా వ్యవస్థ స్తంభించడంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధన సంక్షోభం అక్కడి జనజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తోంది.