పెద్దకడబూరులో దివ్యాంగుల ప్రతిభ
కర్నూలు నగరంలోని హార్ట్ అండ్ ఫౌండేషన్ సెంటర్‌లో నిర్వహించిన ఆర్ట్స్, సాంస్కృతిక పోటీల్లో పెద్దకడబూరు భవిత సెంటర్ విద్యార్థులు ప్రతిభ చాటారు. డాన్స్ విభాగంలో వడ్డె ఉమ, డ్రాయింగ్ విభాగంలో ముద్గల్ జశ్వంత్ ద్వితీయ బహుమతులు సాధించారు. ఇవాళ విజేతలకు ఎంఈవో ఉస్మాన్ భాష మెడల్స్, ప్రశంసాపత్రాలు అందజేశారు. విద్యార్థుల ప్రతిభని మెచ్చుకున్నారు.