ప్రేమ పేరుతో మోసం.. 20ఏళ్లు జైలు శిక్ష

SKLM: గార మండలం దీపావళికి చెందిన నిందితుడికి విజయనగరానికి చెందిన బాలికతో 2023లో ఇన్‌స్టాలో పరిచయమైంది. ప్రేమపేరుతో నమ్మించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్లో అతనిపై పోక్సో కేసు నమోదైంది. కోర్టులో ప్రవేశపెట్టగా 20 ఏళ్ల జైలు శిక్ష, రూ.2,500 జరిమానాను కోర్టు విధించిందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.