జిల్లాలో అకాల వర్షం.. రైతులకు నష్టం

జిల్లాలో అకాల వర్షం.. రైతులకు నష్టం

MLG: వెంకటాపురం, వాజేడు మండలాల్లో భారీ గాలులతో కురిసిన వర్షంతో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. సుడిగాలులతో గంటన్నరకు పైగా కురిసిన వర్షానికి ఆరబోసిన వరి, మిర్చి ధాన్యం తడిసిపోయింది. పక్వ దశలో ఉన్న మామిడి కాయలు నేలరాలడంతో రైతులు నష్టపోయారు. పంట చేతికొచ్చే దశలో అకాల వర్షాలతో రైతుల్లో ఆందోళన నెలకొంది.