VIDEO: CHCని ప్రారంభించిన డిప్యూటీ సీఎం
KMM: కల్లూరు మండల ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు రూ. 12 కోట్ల వ్యయంతో నిర్మించిన కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌ను డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే రాగమయి బుధవారం ప్రారంభించారు. మంత్రులకు స్థానికులు మేళతాళాలతో ఘనస్వాగతం పలికారు. ఈ ఆసుపత్రితో పేదలకు నాణ్యమైన చికిత్స అందుబాటులోకి వస్తుందని వారు పేర్కొన్నారు.