మొంథా వరద బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం విడుదల
WGL: మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా అస్తవ్యస్తమైంది. ఈ నేపద్యంలో వరదల్లో నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ. 12.99 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలతో దెబ్బతిన్న ఇళ్ళకు రూ.15,000 చొప్పున సాయం అందిస్తూ రెవెన్యూ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు.