సుద్దాల అశోక్ తేజకు ఘన సత్కారం

SKLM: బాపూజీ కళా మందిరంలో ఆదివారం ప్రముఖ సినీ గేయ రచయిత డా. సుద్దాల అశోక్ తేజ స్వీయ రచన 'శ్రీశూద్రగంగ' కావ్య గాన సభ నిర్వహించారు. సాహితీ స్రవంతి, శ్రీకాకుళ సాహితీ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. కావ్యం గురించి విశదీకరించారు. రచయిత అట్టాడ అప్పలనాయుడు మాట్లాడుతూ.. సుద్దాల అశోక్ తేజ సమాజం కోసం సాహిత్యాన్ని సృష్టించారని తెలిపారు.