దొంగల కోటయ్య కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ

KMM: ఇటీవల అనారోగ్యంతో మరణించిన సీనియర్ సీపీఎం నాయకులు దొంగల కోటయ్య చిత్రపటానికి సోమవారం ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు తాతా మధుసూదన్ నివాళులర్పించారు. వారి కుమారుడు దొంగల తిరుపతిరావు, కుటుంబ సభ్యులను పరామర్శించారు. నగర బీఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు ముత్యాల వెంకటప్పారావు, భాషబోయిన వీరన్న, మాజీ ఎంపీపీ తిరుపతిరావు ఉన్నారు.