'హోటళ్లలో పరిశుభ్రత పాటించాలి'

VKB: హోటళ్లలో పరిశుభ్రత పాటించాలని మున్సిపల్ శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ ఏసుదాస్ తెలిపారు. బుధవారం వికారాబాద్‌లోని హోటళ్లు, తినుబండరాలు అమ్మే షాపులను మున్సిపల్ సిబ్బంది ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణం కల్పించకుండా కల్తీలకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.