లింబాద్రి గుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు
నిజామాబాద్ జిల్లాలోని భీమ్గల్ శివారులోని శ్రీ మన్నింబాచల క్షేత్రం లింబాద్రిగుట్టపై లక్ష్మీ నృసింహాస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. కొండపై మొదటి అంతస్తులో ఉన్న కళ్యాణ మండపంలో లక్ష్మీ నృసింహాస్వామి ఉత్సవమూర్తులకు ఆలయ పండితులు హవనం, బలిప్రధానం తదితర కార్యక్రమాలను నిర్వహించారు.