పశువుల అక్రమ రవాణా.. రెండు వాహనాలు స్వాధీనం
SKLM: నరసన్నపేట మండల కేంద్రంలో జాతీయ రహదారిపై పశువులతో అక్రమంగా రవాణా అవుతున్న రెండు బొలెరో వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. సోమవారం తెల్లవారుజామున ఒక వాహనంలో 8 మరో వాహనంలో నాలుగు పశువులు రవాణా వచ్చినట్లుగా గుర్తించామన్నారు. ఈ మేరకు పశువులను గోసాలకు తరలించామని ఎస్సై బి గణేష్ తెలిపారు. వాహనాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశామని ఆయన పేర్కొన్నారు.