నేడు నెమలిగుండ్ల రంగస్వామి కళ్యాణం
ప్రకాశం: రాచర్ల మండలం జేపీ చెరువు గ్రామ నల్లమల అటవీ ప్రాంతంలో వెలసిన నెమలిగుండ్ల రంగనాయకస్వామి దేవస్థానంలో ఇవాళ శ్రీదేవి, భూదేవి సమేత రంగ నాయకస్వామి మాస కళ్యాణాన్ని నిర్వహించనున్నట్లు ఈఓ నాగయ్య తెలిపారు. ఉదయం 10 గంటలకు స్వామివారి కల్యాణంలో పీటలపై కూర్చునే దంపతులు రూ.1,516 చెల్లించి రశీదు తీసుకోవాలని సూచించారు.