'ఉపకార వేతనాల సమస్యలు పరిష్కరించుకోవాలి'
KMM: 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల మంజూరులో తలెత్తిన సమస్యలను తక్షణమే పరిష్కరించుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకులు జ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. ఆధార్ లింక్ లేకపోవడం, ఫస్ట్ లెవెల్ వెరిఫికేషన్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు ఇందుకు కారణమని ఆమె పేర్కొన్నారు.