బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ MLA
WGL: గ్రేటర్ వరంగల్ 65వ డివిజన్ పరిధిలోని చింతగట్టు గ్రామానికి చెందిన ఏరుకొండ శ్రీనివాస్, మామగారు రిటైర్డ్ SI జనుగాని ఎల్లయ్య ఇటీవల అనారోగ్యానికి గురై మరణించారు. విషయం తెలుసుకున్న వర్ధన్నపేట మాజీ MLA అరూరి రమేష్ మంగళవారం మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.