పేకాట స్థావరం దాడి ముగ్గురు వ్యక్తుల అరెస్టు
W.G: ఆకివీడు మండలం కుప్పనపూడి శివారులో ఇవాళ పేకాట ఆడుతున్నారని సమాచారంతో ఎస్సై నాగరాజు తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి రూ. 2,370 నగదు, 52 పేకాముక్కలు స్వాధీనం చేసుకొని వారిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.