నేడు మల్కాపురంలో విద్యుత్ అంతరాయం
NDL: మల్కాపురం సబ్ స్టేషన్ పరిధిలో 11 కేవీ పనుల కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ నాగేశ్వర రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 6 వరకు గ్రామాల్లో కరెంటు ఉండదన్నారు. రైతులకు ఉదయం 5 నుంచి 10 వరకు త్రీఫేస్ సరఫరా నిలిపివేస్తారు. ప్రజలు, రైతులు సహకరించాలని ఏఈ కోరారు.