కొనసాగుతున్న నిరసన దీక్షలు

కొనసాగుతున్న నిరసన దీక్షలు

AKP: బల్క్ డ్రగ్ పార్కు వ్యతిరేకంగా నక్కపల్లి మండలం రాజయ్య పేటలో మత్స్య కారులు చేపట్టిన నిరసన దీక్షలు సోమవారం రెండవ రోజుకు చేరుకున్నాయి. మమ్మల్ని ఉరితీసి చంపండంటూ.. మత్స్యకారులు నినాదాలు చేస్తున్నారు. కేసులు పెట్టినా భయపడేది లేదని వారు స్పష్టం చేశారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.