కొనుగోలు కేంద్రంలో జాప్యం.... రైతులు నిరసన
SDPT: బెజ్జంకి, చిలాపూర్ రైతులు మంగళవారం బెజ్జంకి తహసీల్దార్ కార్యాలయం వద్ద వరి ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ.. ఆందోళన చేపట్టారు. రైస్ మిల్లర్లు ధాన్యం తీసుకోకపోవడంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోతోందని రైతులు ఆరోపించారు. తహసీల్దార్ శ్రీకాంత్ వెంటనే DSOకి సమాచారం అందించడంతో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.