డ్రోన్‌తో పోలీసుల నిఘా.. జూదరుల అరెస్ట్

డ్రోన్‌తో పోలీసుల నిఘా.. జూదరుల అరెస్ట్

GNTR: తెనాలి పోలీసులు డ్రోన్‌ కెమెరాలతో శివారు ప్రాంతాలపై నిఘా ముమ్మరం చేశారు. పట్టణ పరిధిలోని పినపాడులో సోమవారం సీఐ రమేశ్ బాబు, సిబ్బంది డ్రోన్‌ కెమెరాతో నిఘా ఏర్పాటు చేశారు. అక్కడ నిర్మానుష్య ప్రాంతంలో పేకాట ఆడుతున్న ముగ్గురిని గుర్తించారు. డ్రోన్‌ను చూసి వారు జారుకునే ప్రయత్నం చేయగా అక్కడికి చేరుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.