ఏకైక రాజధానిగా అమరావతి కోరిన ఉద్యమానికి ఫలితం

GNTR: అమరావతి పునః ప్రతిష్ఠకు కేవలం రెండు రోజులు మిగిలుండగా, ఈ ఉద్యమానికి ఉన్న ప్రాధాన్యత మరింత పెరిగింది. ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగాలని కోరుతూ మహిళలు, రైతులు, కూలీలు కలిసి 1,560 రోజులపాటు నిరంతర ఉద్యమం సాగించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం కలిగించడంతో ఈ పోరాటమే ఇప్పుడు రాజధాని పునఃనిర్మాణానికి మద్దతుగా మారింది.