బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం
VZM: పెదతాడివాడలో నివాసం ఉంటున్న శేశెట్టి వైభవ్ కుమార్ (11) పిల్లలతో ఆడుకుంటుండగా ఎడమ కంటికి కర్ర తగలడంతో చూపు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. వారిది నిరుపేద కుటుంబం కావడంతో అతను చదువుతున్న హైస్కూల్లో పనిచేస్తున్న మాలతి మదర్ సేవా సంఘం అధ్యక్షులు త్యాడ ప్రసాద్‌కు విషయం తెలిపారు. వారు స్పందించి సంఘం తరపున సర్జరీకి రూ.24,001 ఆర్థిక సాయం చేశారు.