VIDEO: కానిస్టేబుల్ ఆత్మహత్య కేసులో అప్‌డేట్
వరంగల్ నగరంలోని మట్టెవాడకు చెందిన భూపాలపల్లి పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33) ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మంగళవారం ఇంట్లో ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్న ఆమె, సూసైడ్ నోట్‌లో శ్రీధర్ అనే కానిస్టేబుల్ వేధింపులే కారణమని పేర్కొంది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో నిందితుడిపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.