రైతుల ఖాతాలో బోనస్.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
NZB: రైతుల ఖాతాలో సన్నాలకు బోనస్ డబ్బులు చెల్లిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేస్తూ పోతంగల్ మండల కేంద్రంలో రైతులు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. స్థానిక బస్టాండ్ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేరుస్తోందని రైతులు పేర్కొన్నారు.