అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం
మహారాష్ట్రలోని భివండి ప్రాంతంలో శరావలి MIDC పరిధిలోని ఓ డైయింగ్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీగా మంటలు ఎగసిపడటంతో ఆ ప్రాంతం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.