VIDEO: సంగమేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు
SRD: ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకీ ఆలయంలో ఆదివారం స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. మార్గశిర మాసం, శుక్లపక్షం, తదియ తిథి పురస్కరించుకొని పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. రుద్రం,బిల్వాష్టకం, శివార్చన, శివాష్టోత్తర శతనామావళి, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేశారు.