గ్రామాల్లో విద్య వాహిని బడిబాట కార్యక్రమం
KNR: గంగాధర మండలం కొండయ్యపల్లి, ర్యాలపల్లి, బూరుగుపల్లి గ్రామాల్లో శనివారం మండల విద్యాధికారి డా. ఏనుగు ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో విద్యా వాహిని బడి బాట కార్యక్రమం చేపట్టారు. ప్రస్తుతం తల్లిదండ్రులు సైతం ప్రభుత్వ పాఠశాలల పట్ల ఆసక్తి చూపిస్తున్నారని, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చడానికి మొగ్గు చూపుతున్నారాని ప్రభాకర్ రావు తెలిపారు.