'ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి'
ATP: వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం చేపట్టిన ‘రైతన్న-మీకోసం’ కార్యక్రమంలో MLA పరిటాల సునీత పాల్గొన్నారు. కనగానపల్లిలో ప్రతి రైతు వద్దకు వెళ్లి ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను వివరించారు. స్థానిక రైతులతో కలిసి గ్రామంలో తిరుగుతూ.. అవగాహన కరపత్రాలను అందజేశారు. రైతుల సంక్షేమం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.