గ్రామస్తులకు త్రాగు నీటి కష్టాలు

గ్రామస్తులకు త్రాగు నీటి కష్టాలు

MDK: రామాయంపేట మండలం కోనాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని బీసీ కాలనీలో తాగునీటి కటకట మొదలైంది. దాదాపు 15 రోజుల నుంచి నీటి సరఫరా తగినంతగా రాక కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోరు మోటర్లు కాలిపోయిన రిపేరు చేయడం లేదని బీసీ కాలనీవాసులు తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి కాలనీలో నీటి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.